NLG: గ్రామాభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు కీలకమని తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండలంలోని తన స్వగ్రామమైన ఉరుమండ్లలో ఆయన ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉద్రిక్తతలకు తావులేకుండా గ్రామస్తులు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.