HYD: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ రూపురేఖలు మారనున్నాయి. మూడు నెలల్లో ఈ మొత్తం విడుదలవుతుందని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓయూ భవన నిర్మాణాల నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరులోపు పనులు ప్రారంభం కానున్నాయి.