HYD: శంషాబాద్లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఓటరును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.