NZB: కోటగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా 11 జిపీలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 16,612 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చలి తీవ్రంగా ఉండడం వల్ల మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ 10 తర్వాత వేగం పెంచుకుంది. కోటగిరి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు.