TG: తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 43.91 శాతం పోలింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో 47.63 శాతం, పెద్దపల్లి జిల్లాలో 53 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.