AP: కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేశారు. కాగా, టీడీపీ, వైసీపీలకు 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. MP, MLA టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.