TPT: తిరుపతిలోని శ్రీతాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి CM చంద్రబాబు రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈక్రమంలో సీఎంను ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, శాప్ ఛైర్మన్ రవినాయుడు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిపై చర్చించారు. త్వరలో తాతయ్య గుంట గంగమ్మ ఆలయ దర్శనానికి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.