ELR: చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్దనుంచి ఆరు లీటర్ల నాటు సారాయిని స్వాధీనపరచుకొని ఆ మహిళపై కేసు నమోదు చేయడమైనదని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ పి.అశోక్ తెలిపారు.