AP: తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 14 ఏనుగులతో కూడిన గుంపు చంద్రగిరి మండలం ఏ రంగం పేటలో తిష్టవేశాయి. 12 ఏనుగులు భారీ కాయంతో ఉండగా రెండు గున్న ఏనులు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి స్థానిక పొలాల్లో బీభత్సం సృష్టించాయి. పంటలను ధ్వంసం చేస్తూ హల్ చల్ చేస్తున్నాయి. రాత్రి సమయంలో ఘీంకారాలు చేస్తుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.