విశాఖలోని గాయత్రీ కాంప్లెక్స్‌లో శుక్రవారం మత్స్యకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు, మత్స్యకారులకు సంబంధిత రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు అందించడంతో 3,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విచ్చేశారు.