NLG: పెద్ద సూరారం గ్రామ నూతన సర్పంచ్ గుండె జానమ్మ, వార్డు సభ్యులు శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్, వార్డు సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులకు నిజాయితీగా సేవలందించాలని సూచించారు.