KDP: ఎర్రగుంట్ల మండల టీచర్స్ జట్టు డివిజన్ స్థాయి విజేతలుగా నిలిచారు. జమ్మలమడుగు డివిజన్ స్థాయి టోర్నమెంట్లో భాగంగా జరిగిన పోటీలో కొడాపురం జట్టుపై విజేతలుగా నిలిచారు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఎర్రగుంట్ల జట్టు 84 పరుగులకు ఆలౌట్ కాగా నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన కొడాపురం జట్టు కేవలం 78 పరుగులు చేసి ఓడిపోయింది. దీంతో ఎర్రగుంట్ల టీచర్స్ జట్టుకు ట్రోఫీలు అందజేశారు.