SRPT: కోదాడ మండలంలో రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.