CTR: నగరి పట్టణంలో ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కరకంఠెశ్వర స్వామి ఆలయ దర్శనం తన భాగ్యం అని నటి విజ్జి చంద్రశేఖర్ భావోద్వేగంతో అన్నారు. శుక్రవారం విడుదలైన అఖండ 2 తాండవం చిత్రంలో హీరో నందమూరి బాలకృష్ణ తల్లిగా నటించిన విజ్జి నగరికి వచ్చారు. శ్రీనివాసా థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూడాలని తన మేనేజర్ చలపతితో పాటు నగరికి వచ్చారు.