EG: రాజానగరం – నరేంద్రపురం జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో స్థానిక పారిశుధ్య కార్మికుడు కొత్తపల్లి శ్రీను(36) మరణించారు. పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆగి ఉన్న శ్రీనును, రాజమండ్రి వైపు మలుపు తిరుగుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఉప సర్పంచ్ కొల్లి వీర్రాజు తెలిపారు. రాజనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.