JN: మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో జనగామలోని కలెక్టరేట్ నుంచి ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్ , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.