NZB: నవీపేట్ మండలం కోస్లీ గ్రామ పోలింగ్ కేంద్రాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రంలోని వసతులు, సిబ్బంది సమన్వయాన్ని ఆయన సమీక్షించారు. పోలింగ్ రోజున ఎటువంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు చేశారు.