చిత్తూరు జిల్లాలో రెండు రోజులాల్ వ్యవధిలోనే 9 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. జిల్లా పరిధిలోని పూతలపట్టు చిత్తూరు, గుడిపాల, సోమల, సదుం, కార్వేటినగరం తదితర మండలాల్లో కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు. కొందరు ఇళ్లల్లో మరికొందరు తిరుపతి, వేలూరులో చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.