MHBD: మరిపెడ మండల తానంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విజయం కోసం ఇవాళ నిర్వహించిన ప్రచారంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ముందుంటుందన్నారు.