KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రోడ్లు చాలా దయనీయంగా మారాయి. పోయిన వర్షాకాలంలో లక్ష్మాపూర్ వద్ద అడవి లింగల్ వద్ద పాడైన రోడ్లు ఇప్పటికీ మరమ్మత్తులు లేకుండా అలాగే ఉండిపోయాయి. రోడ్డుపై మట్టిని పోశారు కానీ రోడ్డు వేయడం మరిచిపోయారు. అన్ని రకాల వాహనాలు రోడ్డుపై వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.