మెదక్ జిల్లాలో మెదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చలిని ఏ మాత్రం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలీసు సిబ్బంది దగ్గరుండి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటేయిస్తున్నారు. దివ్యాంగులు తరలిరావడం వారి చైతన్యానికి నిదర్శనం.