నిర్మల్ జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం ఉదయం 9 గంటల వరకు ఆరు మండలాల్లో కలిపి మొత్తం 16.57 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే.. దస్తూరాబాద్లో 20.13 శాతం, కడెం 18 శాతం, ఖానాపూర్ 20.30 శాతం, లక్ష్మణచందా 10.92 శాతం, మామడ 15.73 శాతం, పెంబి 15.63 శాతం పోలింగ్ నమోదైంది.