నెల్లూరులోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గిరి తెలిపారు. 2023 నుంచి 2025 వరకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఈ ఏడాది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు తమ రెస్యూమ్తో పాటు ధ్రువపత్రాలు తీసుకురావాలని కోరారు.