JN: స్టేషన్ ఘనపూర్ నమిలిగోండ గ్రామంలో జరుగుతున్న ఎన్నికల సరళిని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ వద్ద భద్రత ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. స్థానిక పోలీసులకు శాంతిభద్రతల విషయంలో పలు సూచనలు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు.