జనగామ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. 11 గంటల వరకు చిల్పూర్ లో 42.82%, స్టేషన్ ఘనపూర్ లో 55.17%, లింగాల ఘనపూర్ 50.88%, రఘునాథ్ పల్లి 55.34%, జఫర్గడ్ 34.95%, జిల్లా వ్యాప్తంగా 47.92% ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు ప్రతీ క్షణం నిఘా పెట్టారు.