KDP: కమలాపురం మండలం నడింపల్లిలో బుధవారం భారతి సిమెంట్, పెయిడ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచారం జరిగింది. చీఫ్ మేనేజర్ భార్గవ్ రెడ్డి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరంలో 185 మందికి స్క్రీనింగ్ చేసి, 82 మందికి ఉచితంగా గళ్ళ, రక్త పరీక్షలు నిర్వహించారు.