మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 139 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1,188 వార్డులకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉ.7 గంటలకు ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కవుగా ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.