ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో గత రాత్రి లైసెన్స్ పీరియడ్ కొనసాగుతుండగా సర్పంచ్ అభ్యర్థి ఆర్. మధుకర్ నియమాలను ఉల్లంఘించారు. తన ఇంటి ఆవరణలో 50 మందితో కలిసి ఎన్నికల ప్రచారం చేయడంతో పక్క సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ బృందం తనిఖీ చేసింది. దీంతో ఆ బృందం ఫిర్యాదు మేరకు నార్నూర్ PSలో కేసు నమోదు చేసినట్లు సీఐ అంజమ్మ, ఎస్సై అఖిల్ తెలిపారు.