NLR: విద్యార్థులకు ప్రాథమిక విలువలను నేర్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘విలువల విద్యా సదస్సు’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరులో జరగనున్న ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా రానున్నారు. కస్తూర్భా కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు హాజరు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.