MNCL: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి 13న నిర్వహించనున్న పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో 1,722మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.