SS: మడకశిర నియోజకవర్గానికి రూ. 11.31 కోట్ల రూపాయలు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. మడకశిర, గుడిబండ, ఆగలి మండలాల్లో త్వరలోనే రోడ్ల పనులు ప్రారంభిస్తామని టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రాంట్‌ను విడుదల చేశారు.