కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లో రేపు 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 92 పంచాయతీల పరిధిలోని 866 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, విజయోత్సవ ర్యాలీలు నిషేధించినట్టు ఆయన తెలిపారు.