MDK: రెండవ సాధారణ మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలను వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలను పరిశీలించారు. మొదటి విడత ఎన్నికల కోసం 312 వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ పరిశీలనలో DPO యాదయ్య, DPRO రామచంద్ర రాజు, సందీప్ పాల్గొన్నారు.