KMM: శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, భద్రతకు భరోసా కల్పించేలా అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం ఆధ్వర్యంలో బుధవారం చింతకాని మండలం రామకృష్టపురం, పాతర్లపాడు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు.