శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్జ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ఐదుగురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కోర్టుకు తరలించినట్లు తెలిపారు.