VZM: ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా బొబ్బిలి SMR కళ్యాణ మండపంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్.రోహిణి రావు మాట్లాడుతూ.. మానవహక్కుల ప్రాముఖ్యత, ప్రజల హక్కుల సాధనకు న్యాయస్థానాలు సహకరించే విధానాలను గురించి వివరించారు.