RR: ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్ నగర్, చౌదరిగూడ మండలంలోని 122 గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయని, సమస్యాత్మక ప్రాంతాలను సైతం గుర్తించడం జరిగిందన్నారు.1650 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు,144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు.