ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో SP నితికా పంత్ జిల్లా పోలీస్ కార్యాలయం కమ్యూనికేషన్ సెట్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల పరిస్థితిని సమీక్షిస్తున్న ఆమె, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.