ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా డయాబెటిస్ ముప్పు పొంచి ఉంది. పిల్లల్లో విపరీతమైన దాహం, మాటిమాటికీ మూత్ర విసర్జన, గ్లూకోజ్ లోపం వల్ల ఎంత తిన్నా ఆకలి వేయడం, సడన్గా బరువు తగ్గిపోవడం వంటివి కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే చూపు మసకబారడం కూడా డయాబెటిస్ లక్షణమే. ఇవి కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.