TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆయన్ను జూబ్లీహిల్స్ పీఎస్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కస్టోడియల్ దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది. ప్రభాకర్‌రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని పేర్కొంది.