ఈ నెల 3 నుంచి 5 తేదీల మధ్య తమ విమానాలు రద్దై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఇండిగో ఎయిర్వేస్ శుభ వార్త చెప్పింది. తమ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులకు పరిహారంగా రూ.10 వేల విలువైన ‘ట్రావెల్ వోచర్లు’ ఇస్తున్నట్లు ప్రకటించింది. టెక్నికల్ సమస్యలతో సెర్వీసులు నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కస్టమర్లను కూల్ చేసేందుకు ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది.