SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, సునీల దంపతులు స్వగ్రామమైన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొన్నారని చెప్పారు.