మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరు మండలాల్లో జరిగిన 146 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 85.93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు వివరించారు. 1,63,148 ఓటర్లకు గాను 1,40,200 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.