TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయల్దేరారు. ఈ క్రమంలోనే పార్లమెంటులో మీడియాతో సీఎం ముచ్చటించారు. ఈనెల 13న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్కు వస్తున్నట్లు వెల్లడించారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరు కానున్నట్లు తెలిపారు.