AP: భాషా పండితులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల నాటి కల నెరవేరుస్తూ.. 417 మంది పండితులకు ‘స్కూల్ అసిస్టెంట్లు’గా ప్రమోషన్లు కల్పిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 227 మంది తెలుగు, 91 మంది హిందీ పండితులు, 99 మంది పీఈటీలు ఉన్నారు. ఈ నిర్ణయంపై మంత్రి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.