కృష్ణా: మైలవరం నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రహదారుల అభివృద్ధికి రూ. 11.22 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. దాములూరు గ్రామంలో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో డి. ఎం. ఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, కూటమి నేతలు పాల్గొన్నారు.