ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పాతూరు వార్డ్ సచివాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్డులోని బోర్ వద్ద 15 రోజుల క్రితం మోటార్ చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. వార్డు ప్రజలు గ్రామ సచివాలయం, మున్సిపాలిటీలో నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కరించకపోవడంతో ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద నిరసన చేపట్టారు.