SRD: కంగ్టి మండలం నాగూర్ బీ గ్రామంలో రెండో సారి సర్పంచ్ అభ్యర్థిగా శరణమ్మ బరిలో దిగారు. గ్రామానికి చెందిన శరణమ్మ 2013లో జరిగిన ఎన్నికల్లో పోటీపడి ఆమె గెలుపొందారు. ఆ తర్వాత 2018లో ఆమె కుమారుడు రాజు కుమార్ పాటిల్ భారీ విజయంతో గెలుపొందారు. ఈసారి ఈ గ్రామపంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయింది. దాంతో మళ్లీ ఇదే కుటుంబంలో శరణమ్మ సర్పంచ్ బరిలో నిలిచారు.