BHNG: పోలింగ్ కేంద్రాల వద్ద పచ్చని మొక్కలు, పూలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఓటర్లను కోరారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే ఆలేరు, ఆత్మకూరు, బొమ్మలరామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.