GNTR: లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈనెల 13న జిల్లాలోని తుళ్లూరులో జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వాకాటి కరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు.